ఖైదీ గా మారిన  కార్తి

08 Mar,2019

ఇటీవల ‘దేవ్’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ హీరో కార్తి ఆ చిత్రం తో కెరీర్ లో డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.  ఈ చిత్రం తరువాత ప్రస్తుతం ఆయన ‘మానగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఖైదీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.  డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తరువాత కార్తి ,’రెమో’ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కార్తి కి జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక నటించనుంది. ఈ సినిమా తో ఆమె కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది. 

Recent News